Friday, December 20, 2024

ఫ్రాన్స్‌తో రూ 90వేల కోట్ల డీల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు సాంప్రదాయక స్కోర్పెన్ జలాంతర్గాములు అందనున్నాయి. ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శన సందర్భంగా ఈ కీలక కొనుగోళ్లపై ఒప్పందం కుదరనుంది. వీటి విలువ రూ 90,000 కోట్ల వరకూ ఉంటుంది. ప్రధాని మోడీ ఈ నెల 13,14 తేదీల్లోనే ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. సంబంధిత కొనుగోళ్ల ఒప్పందం గురించి భారత రక్షణ శాఖ ప్రాన్స్‌కు ప్రతిపాదనలు పంపించింది. ప్రధాని పర్యటనలో ఒప్పంద ప్రకటన వెలువడుతుంది.

సముద్ర జలాల్లో తలెత్తుతున్న సవాళ్ల నేపథ్యంలో నౌకాదళానికి రాఫెల్స్ అవసరం ఉంది. దీనికి తోడుగా సబ్‌మెరైన్స్ బలం కావల్సి ఉంది. 22 సింగిల్ సీటు రాఫెల్ మెరైన్‌లతో పాటు నాలుగు శిక్షణ విమానాలు కూడా ఇండియాకు చేరుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య , విక్రాంత్‌లతో మిగ్ 29ల నిర్వహణ జరుగుతోంది. వీటి నుంచే ఇప్పుడు తరలివచ్చే రాఫెల్స్ ను కూడా రంగంలోకి దింపుతారు. ఇక ప్రాజెక్టు 75లో భాగంగా నౌకాదళానికి సబ్‌మెరైన్‌లు అందుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News