Monday, December 23, 2024

అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు పూటకో మాట:  కెఏ. పాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసగించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ విమర్శించారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ దమ్ముంటే రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసి ములుగు ఎమ్మెల్యే సీతక్కను టీపీసీసీ అధ్యక్షురాలుగా చేయాలని సవాల్ విసిరారు. సీతక్కను సీఎం చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి మాటలు దౌర్భాగ్యమైన మాటలని ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని విమర్శించారు.

దళితులను మోసం చేయడానికి రెడ్డీలు అందరూ ఏకం అవుతారా.. బీసీలను ఇంతవరకు బానిసలుగా వాడుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్న అవినీతి ఇంకా ఏ పార్టీలో ఉండదని కాంగ్రెస్ నేతలే చెప్పారని తెలిపారు. అందుకే దేశ నాయకులు గులామ్ నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి పెద్దలందరూ రాజీనామా చేశారన్నారు. నేడు రేవంత్ రెడ్డి మాటలు మీరు నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ సిఫారసు చేయబడిన వ్యక్తిని కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి వచ్చిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News