Monday, December 23, 2024

నగరంలో 43 పెలికాన్ సిగ్నల్స్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పాదచారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 42 ఏర్పాటు చేయాలని లక్షంగా పెట్టుకోగా ఇందులో 31 పెలికాన్ సిగ్నల్స్‌ను ఇప్పటికే ఇన్‌స్టాల్ చేశారు. వీటిని ఉపయోగించుకుని ఇప్పటికే పాదచారులు రోడ్డును దాటుతున్నారు. పాదచారులు దీని ద్వారా 15 నుంచి 20 సెక్షన్లలో రోడ్డును దాటుతున్నారు. పెలికాన్ సిగ్నల్స్ వద్ద పనిచేసేందుకు ట్రాఫిక్ వలంటీర్లు సహకరిస్తున్నారు, అంతేకాకుండా సిగ్నల్‌కు సమీపంలోని ట్రాఫిక్ పోలీసులు

కూడా పాదచారులకు పెలికాన్ సిగ్నల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సిగ్నల్ ఇవ్వగానే రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే ఆపివేసి పాదచారులు రోడ్డును దాటుతున్నారు. అలాగే బస్ జంక్షన్ల వద్ద ఐస్‌ల్యాండ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పాదచారుల కోసం 71ఐస్‌ల్యాండ్ బోర్డులు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన జిబ్రా క్రాసింగ్‌ను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా జిహెచ్‌ఎంసికి పంపించారు.
మెట్రోను వాడుకోండి…
నగరంలోని 56 మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను రోడ్డు దాటేందుకు ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. రోడ్డు దాటేందుకు వీటిని ఉపయోగించుకోవడం వల్ల పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని తెలిపారు.
రోప్ కేసులు….
నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రవేశపెట్టిన రోప్ కార్యక్రమంలో ఈ ఏడాది ఫ్రీ లెఫ్ట్ కేసులు 51,533, స్టాప్‌లైన్ 2,71,187, 41(ఎ) 96,359, వీల్ క్లాంప్ కేసులు 31,341, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేసిన కేసులు 49,038 నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News