Sunday, December 22, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, విదేశీ సిగరెట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు విదేశీ సిగరెట్లతో పాటు అక్రమ బంగారం తరలిస్తున్న నలుగురు నిందితులు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలి కేసులో దుబాయ్ హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 1399 గ్రాముల అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా అధికారులకు దొరికిపోయాడు.

రెండవ కేసులో జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 526 గ్రాముల అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి, అధికారులకు చిక్కాడు. మూడు కేసులు మరొక ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వస్తుండగా 62. 400 విదేశీ సిగరెట్లు తరలించేం దుకు ప్రయత్నించి కస్టమ్స్ అధికారులకు దొరికి పోయాడు. మొత్తం రెండు కేసుల్లో 1.93 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారిస్తున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

Cigarettes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News