Friday, December 20, 2024

ఉమ్మడి పౌరస్మృతికి నై

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కు యుక్తులు పన్నుతున్నదని బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. విభిన్నప్రాంతాలు, జాతులు, మతా లు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చా టుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్ర జల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకు నే నిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామ ని, అందులో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

యుసిసి బిల్లుతో దేశంలో ప్ర త్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని సిఎం అన్నారు. దేశ ప్రజల అస్థిత్వానికి వారి తర తరాల సాంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా మారిన.. బిజెపి కేంద్ర ప్ర భుత్వం అమలు చేయాలనుకుంటున్న యుసిసి బి ల్లును వ్యతిరేకించాలని, తద్వారా దేశ ఐక్యతకు పా టు పడాలని కోరుతూ సోమవారం నాడు ఆలిండి యా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఏ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,

ఎంఎల్‌ఎ అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్, బోర్డు కార్యవర్గ సభ్యలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…“కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యుసిసి నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమవుతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బిజెపి ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యుసిసి అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బిజెపి తీసుకోవాలనుకుంటున్న యుసిసి బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.

భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి యు.సి.సి బిల్లుపై పోరాడతాం
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో యుసిసి బిల్లును బిఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ యు.సి.సి బిల్లుపై పోరాడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. కాగా…మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునీ తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలని, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని, తక్షణమే స్పందిస్తూ…ఉమ్మడి పౌర స్మృతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినందుకు దేశ ప్రజలందరి తరఫున బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కెసిఆర్‌కు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

ఉమ్మడి పౌరస్మృతితో హిందువులకూ నష్టం : ఓవైససీ
ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి) వస్తే ముస్లింలతో పాటు హిందువులకూ నష్టం జరుగుతుందని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. యూసిసి పేరుతో దేశంలో లౌకికవాదాన్ని దేబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యూసిసికి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని చెప్పారు. అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి ప్రగతి భవన్‌లో ముఖ్యమ ంత్రి కెసిఆర్‌ను కలిసిన తర్వాత అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసిసి) ని వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, యూసిసి ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కెసిఆర్ కు విన్నవించామన్నారు. లౌకికవాదాన్ని దెబ్బతీయాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు.

యూసిసిని వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కోరుతామని చెప్పారు. భారత దేశం అంటే బిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కోట్ల సంఖ్యలో గిరిజనులున్నారు. యూసిసి వల్ల వారందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. హిందూ వివాహ చట్టం రద్దవుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు ఒవైసి చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ బిల్లు ముస్లింలతో పాటు ఎవరికీ మంచిది కాదు, ప్రదాని మోడికి లౌకికవాదం అంటే ఎలర్జి అని ప్రతినిధి బృందం సిఎంతో వన్నివించిందన్నారు. యూసిసికి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని, అన్ని రాష్ట్రాల సిఎంలు, పార్టీ అధినేతలను కలుస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభలో కీలక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మీ వైఖరిని ధైర్యంగా తెలిపినందుకు ప్రతినిధి బృందం సిఎంను అభినందించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News