Friday, December 20, 2024

డిజిటల్ గ్రామ పంచాయతీగా కడ్తాల్

- Advertisement -
- Advertisement -
  • సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి

కడ్తాల్: గ్రామ పంచాయతీలను డిజిటల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి అన్నారు. పంచాయతీ పరిధిలోని ఉద్యోగులంగా పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బయోమెట్రిక్ యంత్రంలో హజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

కడ్తాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ లక్ష్మీనర్సింహ్మరెడ్డి అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న పలు సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. గ్రామపంచాయితీ కార్యాలయంలో బయోమెట్రిక్ వ్యవస్థతో హజరు నమోదు చేయనున్నట్లు, అదేవిధంగా సిబ్బందికి సమాచారం చేరవేతకు ఎలక్ట్రానిక్ వాకిటాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కడ్తాల గ్రామపంచాయితీనికి డిజిటల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు లక్ష్మీనర్సింహ్మరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, పంచాయితీ కార్యదర్శి రాఘవేందర్, ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, వార్డు సభ్యులు నరేందర్‌రెడ్డి, మల్లయ్య, బిక్షపతి, మహేష్, గణేష్, ఎట్టమ్మ, బుజ్జి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News