Tuesday, December 24, 2024

ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి కే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ క్రమం లోనే ఈ పిటిషన్‌పై తమ వైఖరిని తెలపాలని కోరుతూఏ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఈ పిటిషన్‌ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.

ఐఎఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సు ప్రీంకోర్టు గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. కానీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది. దీన్ని కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రా జ్యాంగ విరుద్ధమై న చర్యగా ఆరోపిస్తోంది. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధి కారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తుందని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతోపాటు దానిపై మధ్యంతర స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఆర్డినెన్స్‌పై పోరులో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే ఆయా రాష్ట్రాల సిఎంలు, పార్టీ నేతలను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News