ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ రైల్వే వంతెనకు ప్రభుత్వం టెండర్లు పిలస్తుంటే మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు చేయ డం సరికాదని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్‌లు అన్నారు.
ఘట్‌కేసర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇన్నాళ్ళు లేనిధి ఇప్పుడు రైల్వే వంతెన నిర్మాణ పనులలో నిర్లక్షం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డిని విమర్శిస్తూ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ రాజీనామ చేయడంతో పాటు పలువురితో చేయించడం హస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు. వంతెన నిర్మాణానికి 9 కోట్ల 37 లక్షల నిధులు మంజూరైనావని, ఈ నెల చివరలో కొత్త కాంట్రాక్టర్ పనులు చేపడుతారని తెలిపారు.
వంతెన నిర్మాణం పట్ల ప్రజలను ఆయోమయానికి గురిచేయ వద్దని, మున్సిపాలిటీ అభివృద్ది కోసం కలసి ముం దుకు నడుద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, బ ండారి అంజనేయులు, కొమ్మిడి అనురాధ, కడుపోల్ల మల్లే ష్, జహంగీర్, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం పాల సుధాకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు షౌకత్ మియా, నాయకులు కందకట్ల మాధవరెడ్డి పాల్గొన్నారు.