Monday, December 23, 2024

మోడీ, యోగీలకు బెదిరింపు కాల్: నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపివేస్తానంటూ హెల్ప్‌లైన్ నంబర్ యుపి-112 కు ఫోన్ చేసి బెదిరించిన ఒక 45 ఏళ్ల వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి మెల్ప్‌లైన్ నంబర్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, గోరఖ్‌పూర్ నగరంలోని భిజోలీ ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్‌గా కాలర్ తనను తాను పరిచయం చేసుకున్నాడని దేవరియా కొత్వాలీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ డికె మిశ్రా విలేకరులకు తెలిపారు.

ఫోన్ కాల్ వచ్చిన మొబైల్ ఫోన్ లొకేషన్‌ను పరిశీలించగా అది గోరఖ్‌పూర్ జిల్లాలోని హర్పూర్ బుధట్ తాలూకా దేవ్ద్ గ్రామంగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఆ గ్రామినిక చెందిన సంజయ్ కుమార్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మద్యం మత్తులో నిందితుడు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేఇనట్లు ఆయన చెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News