Monday, December 23, 2024

రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులపై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తానా సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెడుతామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏదీ ఫైనల్ కాదని, ఎంఎల్‌ఎ సీతక్కను సిఎం చేస్తానన్న వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, రేవంత్ ఎందుకింత గందరగోళంగా మాట్లాడుతున్నారో? అర్థం కావడం లేదన్నారు. రేవంత్‌పై టిడిపి ఎంఎల్‌ఎ, నటుడు బాలకృష్ణ ప్రభావం పడిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కార్యకర్తల పార్టీ అని చెప్పుకొచ్చారు. రేవంత్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తనకు తెలియదన్నారు.

Also Read: ఉరేసుకున్న మహిళా కానిస్టేబుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News