Friday, November 15, 2024

ఎన్‌ఆర్‌ఈసిలో బ్లాక్ చైన్ టెక్నాలజీపై వర్క్ షాప్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో గల నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సొసైటల్ అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే అంశంపై భారత ప్రభుత్వ సంస్థ అయిన ఏస్‌ఈఆర్‌బి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్) సహకారంతో వారం రోజుల పాటు వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెఎన్టీయూహెచ్ డైరెక్టర్ డాక్టర్ గోవర్ధన్, గౌరవ అతిధిగా జెఎన్టీయూహెచ్ ఎన్డీసి డైరెక్టర్ డాక్టర్ సి. శోభ బిందు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అనేది ఒక రకమైన డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ అని, ఇది సిస్టమ్‌ను మార్చడం, హ్యాక్ చేయడం, సైబర్ ఫ్రాడ్స్ వంటివి నిరోధిస్తూ, ఇన్ఫర్మేషన్‌ను, ట్రాన్సాక్షన్‌లను రికార్డ్ చేస్తుందని, వీటి వల్ల బ్యాంక్ లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయని తెలిపారు.

డాక్టర్ సి. శోభ బిందు మాట్లాడుతూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ నేటి కాలంలో ప్రజాదరణ పొందడానికి అత్యంత కీలకమైన కారణం పారదర్శకత, మార్పుచేయలేని లక్షణం అని, అత్యంత సురక్షితమైనది, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్, ఆటోమేటెడ్, ఫాస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వంటి ఎన్నో ప్రయోజనాలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సొంతం అని చెప్పారు. ఇది బ్యాంకింగ్ లోనే కాక వ్యక్తిగత గుర్తింపు భద్రత, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్ వంటి అనేక రంగాల్లో కూడా ఇది ముఖ్య పాత్ర పోషించగలదని తెలిపారు. ఏథెరియం, హైపర్ లెడ్జిర్, క్రిప్టో వంటి అంశాలపై నిపుణులు ఉపన్యసించారు.

కళాశాల కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి వర్క్‌షాప్‌ల వలన అధ్యాపకులు అధునాతన విజ్ఞానాన్ని అభ్యసించగలరని, తద్వారా విద్యార్థులను సాంకేతికత వైపు మరింత ముందుకు నడిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ జె నర్సింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డా. మోహన్ బాబు, ప్రిన్సిపాల్ డా. ఆర్. లోకనాథం, సీఎస్‌ఈ విభాగాధిపతి ఎఏఎల్‌ఎన్ సుజిత్, సిఎస్‌ఈ డీన్ రామ సుబ్బారెడ్డి, కార్యక్రమ కార్యకర్త డాక్టర్ దిలీప్ రెడ్డి, వివిధ కళాశాలల నుంచి పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News