Saturday, December 21, 2024

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర కార్మిక , ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 4, 5, 12, 13, 14, 15 వార్డులలో 2 కోట్ల 13 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి భారతదేశానికి ఆదర్శంగా మారిందని అన్నారు. దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పధకాలు అద్బుత ఫలితాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికలలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలిపారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ పట్టణ అబివృద్ధికి ఎంతగానో సహకారం అందిస్తున్న మంత్రి మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ పట్టణం కౌన్సిల్ ఏర్పాటు కాకముందు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని కౌన్సిల్ ఏర్పాటు తర్వాత ప్రగతి దిశగా పయనిస్తుందని తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ అన్ని విధాలుగా అబివృద్ధి చేశామని పేర్కొన్నారు.

మేడ్చల్ మున్సిపల్ ప్రగతికి కృషి చేస్తున్న మంత్రి మల్లారెడ్డికి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారెడ్డి నం రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, మున్సిపల్ కమిషనర్ వి. రాములు, డి ఈ విజయ లక్ష్మి, మేడ్చల్ పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షులు శేకర్ గౌడ్, కౌన్సిలర్లు జకట దేవరాజ్, తుడుం గణేశ్, పెంజర్ల నర్సింహా స్వామి, బత్తుల శివ కుమార్ యాదవ్, బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ యాదవ్, కౌడే మహేష్ గారు, కో- ఆప్షన్ సభ్యులు మహబూబ్ అలీ, నవీన్ రెడ్డి, నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, మధుకర్ యాదవ్, నాగరాజు, భాస్కర్ యాదవ్, సత్యనారాయణ, మోహన్ రెడ్డి, రామస్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News