Saturday, November 16, 2024

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

వడ్డేపల్లి : గ్రామాల అభివృదిక్ధి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం కొంకలా గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామ గ్రామాన వైకుం ఠధామాలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

కెసిఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు. యావత్ భారతదేశంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని, ఆయన చేపట్టిన రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీలు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, కంటి వెలుగు, ఆసరా ఫించన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అభివృద్ధికి ప్రతిభింబిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News