Saturday, November 16, 2024

పాడి పంటల సుభిక్షం కోసమే బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -

రుద్రూర్ : పాడి పంటల సుభిక్షం కోసమే ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల పండుగను నిర్వహిస్తామని బిఆర్‌ఎస్ బాన్సువాడ నియోజక వర్గ ఇన్‌ఛార్జి పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబంఆర్ గ్రామంలో మంగళవారం జరుపుకుంటున్న బోనాల పండుగకు పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి బోనాలను ఎత్తుకున్నారు.

ఉదయం గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామం నుంచి పెద్ద ఎత్తున పోతరాజుల విన్యాసాలతో, భాజభజంతులతో, ఆట పాటలతో గ్రామస్తులందరూ ఏకతాటిగా కలిసి గ్రామ పెద్ద పోచమ్మ, మహాలక్ష్మి మందిరాలకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కులమత తారతమ్యం లేకుండా బోనాల పండుగను ఘనంగా నిర్వహి ంచుకున్నారు. గ్రామంలో పాడి పంటలు, గోవు గొడ్డు చల్లగా ఉంచాలని, గ్రామస్తులు మొక్కు లను తీర్చుకున్నారు. గ్రామంలో అందరూ చల్లగా ఉంచాలని మొక్కుకున్నారు. కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్, ఎంపిటిసి మంత్రి లక్ష్మి, ఎంజిఆర్, గ్రామ పెద్దలు శానం ఘన శ్యామ్, పట్టేపు రాములు, పట్టేపు పోశెట్టి, జక్రి నరేందర్, ఇందూర్ భూషణం, శానం హనుమాన్లు,. నాయక్ సాయిలు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News