- ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలను చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్యే
బెజ్జంకి: తెలంగాణ ప్రభుత్వం రైతులను రాజు చేస్తున్న తరుణంలో రైతులకు ఎనమిది గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు సిగ్గుచేటని మనకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 24 గంటల విద్యుత్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌కి ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు.
కెసిఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.తెలంగాణ ప్రాజెక్టులు ద్వారా రైతాంగానికి సాగునీరు, 24 గంటల కరె ంట్, రైతు బంధు, రైతు బీమా ఇంకా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూసి ఓర్వలేక ఇలాంటి వాక్యాలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చెర్మెన్ బండి రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కచ్చు రాజయ్య, నాయకులు లక్ష్మణ్, గుబేరీ మల్లేశం, ప్యాక్స్ డైరెక్టర్ దిటి బాలనర్స్, అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, ఎలా శేఖర్ బాబు,జెల్ల ప్రభాకర్, పోట్లపల్లి శివ, గణపురం తిరుపతి, రావుల రాజు,తదితరులున్నారు.