Friday, November 22, 2024

జనాభా నియంత్రణ విధానాలు కట్టుదిట్టంగా అమలు పర్చాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్

సిద్దిపేట: జనాభా నియంత్రణ విధానాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలో జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించుకుంటామని ఉద్దేశమన్నారు. మన దేశంలో జనాభా 142 కోట్లకు చేరిందని ప్రపంచంలో మొదటి స్ధానాన్ని ఆక్రమించిందని తెలిపారు. జనాభా పెరుగుదల వలన నిరుద్యోగం, పేదరికం, ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయని జనాభా పెరుగుదలతో సంభవించే సమస్యలను అవగాహన చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులపైన అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఒక్కరే సంతానం కలిగి కుటుంబాన్ని శాశ్వత కుటుంబ నియంత్రణ పద్దతులు అవలంభించిన అనంతగిరి గ్రామానికి చెందిన కర్రె మౌనిక , అదే విధంగా ఐదు సంవత్సరాల పాటు ఐయూసిడిని వేయించుకుని తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతిని పాటిస్తున్న సాదుల సురేఖ, అంతర ఇంజక్షన్ తాత్కాలిక పద్ధతులను పాటిస్తున్న రాయిని స్వప్ణ వారికి లక్కి డిప్ ద్వారా ఎంపిక కాగా వారికి ఆర్థిక పారితోషికం అందజేశారు. అదే విధంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన సర్జన్ డాక్టర్ మంజుల, స్టాప్‌నర్స్ అంబాదేవి, ఎఎన్‌ఎం మహాలక్ష్మి, శోభలకు ప్రశంస పత్రాలతో పాటు మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయరాణి, డాక్టర్ ఆజీముద్దిన్, సాయిరామ్, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్, మదన్‌మోహన్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. మహిళా అక్షరాస్యత ద్వారానే ఆర్థిక స్వాలంభన, నాణ్యమైన సమాజ నిర్మాణం జరుగుతుందని ఇంచార్జి ప్రిన్సిపాల్ హుస్సెన్ ఆన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రి కళాశాలలో ఆర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్, భవానిలు మాట్లాడుతూ సమానత్వం కోసం మహిళల నైపుణ్యాభివృద్ధి అనే ఐక్యరాజ్య సమితి యొక్క నినాదం 2023 పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రకృతి వైపరిత్యాలుఏర్పడుతాయని ప్రతిఒక్కరికి సామాజిక బాధ్యత అవసరమని, అలాగే ప్రభుత్వాలు సైతం కట్టుదిట్టమైన జనాభా నియంత్రణ విధానాలను కలిగి ఉండాలన్నారు. మహిళలు చైతన్యం అయితేనే నాణ్యమైన కుటుంబం, ఆర్థిక, ఆరోగ్య సమాజం నెలకొల్పవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఎసికో ఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఆకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శనం, పీజి కో ఆర్డీనేటర్ డాక్టర్ ఆమోధ్యరెడ్డి , ఆధ్యాపకులు డాక్టర్ సుజాత, డాక్టర్ మల్లేశం, శ్రద్దానందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News