- Advertisement -
పానుగల్ : మండల దావత్‌ఖాన్ పల్లి గ్రామానికి చెందిన పెద్ద మన్నెం నాయుడు కాలుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్సవర్ధన్ రెడ్డికి వివరించగా వారు స్పందించి సిఎంఆర్‌ఎఫ్ పథకం కింద లక్షా 50 వేల రూపాయల ఎల్‌ఓసిని మంజూరు చేయించారు. మంగళవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసిని అందజేశారు. తమ వినతిని మన్నించి ఎల్‌ఓసిని మంజూరు చేయించినందుకు సిఎం కెసిఆర్‌కు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎం. రాము యాదవ్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.
- Advertisement -