Saturday, December 21, 2024

పార్టీ మారినా గుణం మారలే..!

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీ మారినా తనగుణం ఏమాత్రం మారలేదని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీరియస్ అయ్యారు. 24గంటల ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ తీరు ఎలా ఉండనుందో ఆయన మాటల్లోనే బయటపడిందని విమర్శించారు. మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు.

టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి లోపల చంద్రబాబుంటే, బయట మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరుగుతున్నాడన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రైతు తమ సమస్యలపై పోరాటం చేసి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై చేసిన అఘాయిత్యాలను రైతులు నేటికీ మరిచిపోలేదన్నారు. రేవంత్ రెడ్డి తన విచక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాడనీ..

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి గొప్ప పథకాలు ప్రజా శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టినవని వాటిని ఉచితాలనడం తన మూర్ఖత్వమని నిదర్శనమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రెండురోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం, రేవంత్ బొమ్మకు శవయాత్ర లాంటి కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

మానకొండూర్ జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపెల్లి శేఖర్ గౌడ్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు రావుల రమేశ్, పాకాల మహిపాల్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, మానకొండూర్ మండలాధ్యక్షుడు రామంచ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News