Monday, December 23, 2024

మొక్క నాటిన ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాల్లెంజ్ లో భాగంగా బంధు మిత్ర కుటుంబ సమేతంగా తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎంఎల్‌సి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి మొయినాబాద్‌లో తన వ్యవసాయ క్షేత్రంలో మొక్క నాటారు.
‘భావి తరాలకు స్ఫూర్తినందించే గొప్ప కార్యక్రమం’
తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ విద్యార్థులు, పాఠశాల ఉపా ధ్యాయులతో కలిసి ఓయూ గిరిజన రాష్ట్ర నేత డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ మాట్లాడుతూ అడవులను, ప్రకృతిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో ఎంపి సంతోష్ తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారం చేయడం గొప్ప విషయ మన్నారు. భావి తరాలకు స్ఫూర్తిని అందించే గొప్ప కార్యక్రమన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రపంచం అంతటా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో శ్రీసాయి విజ్ఞాన భారతి హై స్కూల్ కరస్పాండెంట్ డా.శశిధర్ రెడ్డి ,డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డి, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News