Sunday, December 22, 2024

కార్యకర్తలే బిఆర్‌ఎస్‌కి కొండంత బలం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కొన్నింటి మణిక్ రావు

కోహీర్: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ సారాధ్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికి మార్గదర్శిగా నిలుస్తుందని ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు, మంగళవారం మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో ప్రమాదవశత్తు అవుషా మల్లేశం అనే వేక్తి గత రెండు నెలల క్రితం మరణించారు. మృతుడికి బిఆర్‌ఎస్ సభ్యత్వం ఉండటంతో మరణించిన వ్యక్తి కుటుంబ నామినికి కోహిర్ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్, గ్రామ సర్పంచ్ నర్సింలు తో కలిసి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం నిత్యం ఎన్నో పథకాలు అందిస్తున్నారని, పార్టీ సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే నామినికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.. కార్యక్రమంలో కోహిర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జంగిలి రవికిరణ్, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు యాదవ్, బిలాల్ పూర్ గ్రామ సర్పంచ్ మచికొడుకు నర్సింలు, ఉప సర్పంచ్ శైలజ నర్సిములు, గోపాల్, కోహిర్ మండల యువ నాయకులు మచికొడుకు సునీల్, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News