Friday, December 20, 2024

నచ్చిన ఆహారం లేదని వాగ్వాదం.. విమానం అత్యవసరంగా ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : తనకు ఇష్టమైన ఆహారం విమానంలో అందుబాటులో లేదని ప్రయాణికుడి వాదన చివరకు ఏకంగా ఆ విమానాన్నే దారి మళ్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. అమెరికా నుంచి నెదర్లాండ్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికా లోని హూస్టన్ నుంచి నెదర్లాండ్స్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌కు ఆదివారం సాయంత్రం 4.20 కు బయలుదేరింది.రెండు గంటల తరువాత అది షికాగో నగర సమీపంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. దాదాపు రెండు గంటల పాటు అలా చేసినట్టు సమాచారం. సాధారణంగా అత్యవసర సమయంలో విమానం ల్యాండింగ్ కావాలంటే అందులోని ఇంధనాన్ని డంప్ చేస్తాయి.

ఇలా భిన్న వార్తలు వస్తోన్న తరుణంలోనే విమానం షికాగో లోని ఓహరే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. దీనిపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఓ ప్రయాణికుడు ఇబ్బందికర ప్రవర్తన కారణంగా అమ్‌స్టర్‌డామ్‌కు వెళ్తోన్న విమానం షికాగోలోని ఓ హరే ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించాం. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడ్ని విమానం నుంచి దించి వేశారు. తనకు నచ్చిన ఆహారం ఆ విమానంలో అందుబాటులో లేకపోవడంతో అతడు మద్యం మత్తులో అలా ప్రవర్తించినట్టు విమాన ప్రయాణాలను ట్రాక్ చేసే వ్యవస్థ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News