Sunday, January 19, 2025

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటి యజమాని ఫాంహౌస్‌కు వెళ్లి వచ్చే సరికి నేపాల్‌కు చెందిన పనిమనులుషులు భారీ చోరీ చేసిన సంఘటన రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో వ్యాపారి ఇంటి నుంచి రూ. 45 లక్షల నగదు, నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10కిలోల వెండి వస్తువులను చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. సికింద్రాబాద్, సింధీ కాలనీకి చెందిన వ్యాపారి రాహుల్ గోయల్ బోనాల పండగ చేసుకునేందుకు కుటుంబంతో కలిసి ఈ నెల 9వ తేదీన మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లాడు.

తిరిగి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండివస్తువులు కన్పించకుండా పోయాయి. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన కమల్ కుటుంబ సభ్యులు కూడా కన్పించలేదు. దీంతో వెంటనే రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేక బృందాలు….
నేపాల్ దేశానికి చెందిన నిందితులు ఇండియా నుంచి పారిపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు నిందితులు నేపాల్‌కు పారిపోకుండా ఉండేందుకు నేపాల్, ఇండియా సరిహద్దులో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News