- టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
జిల్లేడుచౌదరిగూడెం: రాబోయే ఎన్నికల్లో షాద్‌నగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని కాస్లబాద్, ఎదిర గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాలని మండల నాయకులకు సూచించారు.
కెసిఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంటగ్యాస్ ధరను 500 రూపాయలను చేస్తామని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫి, చేయూత పథకం ద్వారా 4 వేల రూపాయల పింఛను అందిస్తామని అన్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని అన్నారు. రాబోయే రోజుల్లో బిసి డిక్లరేషన్ తోపాటు మరిన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుందని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలలు కార్యకర్తలు అహర్నిషలు కృషిచేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
పార్టీలో చేరికలు
మండల పరిధిలోని కాస్లబాద్ ,ఎదిర గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి వీర్లపల్లి శంకర్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. వారిలో కాస్లబాద్‌కు చెందిన నర్సింలు,శివకుమార్, అనంతయ్య, అంజిరెడ్డి, రాజు, రామస్వామి, ధీమ రామస్వామి, శంకర్, శేఖర్, పురుషోత్తం,శివకుమార్,ఎదరి గ్రామానికి చెందిన వడ్డె రాములు, నర్సింలు, చంద్రయ్య, రాములు, వెంకటయ్య, యాదయ్య, చెన్నయ్య, రంగయ్య, నర్సిం లుతోపాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.