Monday, December 23, 2024

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోన రావుపేట పోలీస్ స్టేషన్ లో నిందితున్ని అరెస్ట్ చేసిన సమయంలో చందుర్తి సి ఐ ఏ.కిరణ్ కుమార్ అన్నాడు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జూన్ 2నాడు కొనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము పోచయ్య అనే వ్యక్తి తన కొడుకు కొమ్ము ప్రశాంత్ బతుకుతెరువు కోసం మస్కట్ వెళ్లాడని,అక్కడి నుండి డబ్బులు పంపిస్తే ఏటీఎం ద్వారా కుటుంబసభ్యుల డ్రా చేసుకొని వాడుకునే వాళ్ళని అన్నారు.

అయితే పోచయ్య ఇంటి ప్రహరీ గోడ పెట్టుటకు డబ్బులు కావాలని కొడుకు చెప్పగా ప్రశాంత్ తన యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్ 064710100132494 నందు రెండున్నర లక్షలు ఉన్నాయని వాడుకోమని చెప్పాడు.దీనితో తండ్రి పోచయ్య ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేద్దాం అని వెళ్లి చూడగా డబ్బులు లేవని ఏటీఎం నందు చూపెట్టిందని పోలీసులకు వివరించారు.

వెంటనే బ్యాంకు నందు సంప్రదించగా ఏప్రిల్ 10 నుండి 13 వరకు పలు దఫాలుగా సుమారు 2 లక్షల 48 వేల రూపాయలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా డ్రా అయినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారని వెల్లడించారు.దాంతో పోచయ్య కోనరావుపేట పోలీస్ స్టేషన్ నందు తన కొడుకు బ్యాంక్ ఖాతా నుండి ఆన్లైన్ ద్వారా ఎవరో గుర్తు తెలియని వారు డబ్బు డ్రా చేసి తీసుకున్నారని ఫిర్యాదు చేశాడు.

దీనిపై ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసిన అనంతరం చందుర్తి సిఐ కిరణ్ కుమార్ దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా ఉద్దవోలు గ్రామానికి చెందిన కర్రి నవీన్ కుమార్ వృత్తిరీత్యా HBC కంపెనీ బెంగళూరు నందు సాప్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.గత ఫిబ్రవరిలో తన ఇంటి నందు జియో ఫైబర్ నెట్ పెట్టించుకున్నాడని అప్పుడు అతను జియో సిమ్ 9346191678 నీ తీసుకున్నాడని అన్నారు.

మొబైల్ యాప్ ద్వారా ఏప్రిల్ 3న ఒక లక్ష రూపాయలు అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు నవీన్ తన జియో సిమ్ కి మెసేజ్ వచ్చిందని కానీ అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, తదుపరి ఏప్రిల్ 07 నాడు ఇంట్రెస్ట్ 1000 రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చిందని నిందితుడు ఒప్పుకున్నడని అన్నారు

.ఈ డబ్బులు కూడా తన బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోయేసరికి తాను ఈ యొక్క జియో నెంబర్ ద్వారా పేటీఎం ఎకౌంట్ ని క్రియేట్ చేసుకుని చూడగా తన యొక్క జియో నెంబర్ కొమ్ము ప్రశాంత్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినట్టు తెలుసుకొని ప్రశాంత్ అకౌంట్లో రెండు లక్షల నలభైవేల చిల్లర డబ్బులు ఉన్నాయని తెలుసుకొని ప్రశాంత్ ని మోసం చేసి ఆ డబ్బులు డ్రా చేసుకుందామని అనుకుని,ఏప్రిల్ 10 నుండి 13 వరకు నవీన్ కుమార్ తన జియో నెంబర్ ద్వారా క్రియేట్ చేసుకున్న పేటీఎం నుండి పాలు దఫాలుగా 2లక్షల47వేల973 రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడని కేసు దర్యాప్తులో తేలిందని అన్నారు.

అయితే కొమ్ము ప్రశాంత్ తాను మస్కట్ కి వెళ్లే ముందు తాను జియో నెంబర్ 9346191678 నీ వాడాడు అదే నెంబర్ ని తన యూనియన్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకున్నాడు తర్వాత అతను మస్కట్ వెళ్లాక ఆ నెంబర్ ని వాడలేదు మరియు తన బ్యాంక్ అకౌంట్ కి ఆ నంబర్ నీ డిఆక్టివేట్ చేయలేదని అన్నారు.కొన్ని నెలల తరువాత అదే నెంబర్ని సర్వీస్ ప్రొవైడర్ వారు నిందితుడైన కర్రీ నవీన్ కుమార్ కి కేటాయించారు, నవీన్ కుమార్ దానిని అదునుగా తీసుకొని కొమ్ము ప్రశాంత్ ని మోసం చేసి తన ఎకౌంటు ద్వారా డబ్బులు తీసుకున్నాడని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క కేసుని చేదించి కర్రీ నవీన్ కుమార్ ఆ డబ్బు తీసుకొని తన ఫ్రండ్స్ తో జల్సాలు చేశాడని,తను హైదరాబాద్ వెళ్తుండగా వరంగల్ లో మంగళవారం అతనిని పట్టుకొని మొత్తం డబ్బు 2 లక్షల 47 వేల 973 రూపాయలు అతని నుండి సీజ్ చేయడం జరిగిందని అన్నారు.

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి.ఐ అన్నారు.ఎవరైనా తమ మొబైల్ నెంబర్ ని వాడటం నిలిపివేస్తే తప్పకుండా దానికి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ కి మరియు డిజిటల్ పేమెంట్స్ అకౌంట్ కి డి ఆక్టివేట్ చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కేసును ఛాలెంజ్ తీసుకుని,కేసును చేదించి నిందితున్ని పట్టుకొని డబ్బులు రికవరీ చేసిన చందుర్తి సీఐ ఏ కిరణ్ కుమార్,కోనరావుపేట ఎస్సై రమాకాంత్,ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి,కానిస్టేబుల్ దండి నరేష్ లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,అడిషన్ ఎస్పీ చంద్రయ్య లు అభినందించారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News