Friday, November 22, 2024

ఆమనగల్లు మండలానికి మహర్దశ

- Advertisement -
- Advertisement -
  • ఆమనగల్లుకు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
  • ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభం
  • త్వరలోనే ఆమనగల్లుకు అన్ని డివిజన్ కార్యాలయాలు మంజూరు చేయిస్తా
  • ఆమనగల్లు మున్సిపాలిటీలో రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

ఆమనగల్లు: నాలుగు మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు మండల కేంద్రానికి నూతన శకం ప్రారంభమైందని కల్వకుర్తి ఎమ్మె ల్యే గుర్కా జైపాల్‌యాదవ్ తెలిపారు.

అన్ని డివిజన్ కార్యాలయాల ఏర్పా టుకు కృషి చేస్తున్నట్లు ఆయన పెర్కోన్నారు. ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో మంగళవారం జెడ్పిటిసి నేనావత్ అను రాధ పత్యనాయక్, ఎంపిపి నేనావత్ అనిత విజయ్, మార్కెట్ చైర్మన్ నాలా పురం శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు, ము న్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యనాయక్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ముఖ్యమంత్రి కెసీఆర్ రావడంతో ఆమనగల్లు మండలానికి పట్టిన గ్రహణం వీడిపోయిందని అన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమనగల్లులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హమీలు ఒక్కోక్కటిగా నెరవేరాయని తెలిపారు. నూతనంగా ఆమనగల్లు పట్టణానికి ఏడీఏ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలు, మంజూరైయాయ్యని 202324 విద్యా సంవత్సరంలో కోర్సులతో ఈ విద్యా సంవత్సరమే ప్రారం భమవుతుందని, వీటికి సంబంధించిన జీఓ కాపీలు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆమన గల్లులో 50 పడకల ప్రభుత్వాసుపత్రికి, ఏసీపీ, ఆర్డీవో, ఆర్టీవో, ఎస్టీవో, సబ్ రిజిస్ట్ట్రార్ సంబంధించిన ప్రతిపాదనల దశలో ఉన్నాయని త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు మంజూరవుతాయని ఆయన వెల్లడించారు.

ఆమనగల్లు మున్సి పాలిటీలో ఇప్పటికే రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతు న్నాయని జైపాల్‌యాదవ్ వెల్లడించారు.

రైతు వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ సిద్ధాంతం

తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు దండుగ అని రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్య మంత్రి కెసీఆర్ దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి, వారి అభివృద్ధికి కృషి చేస్తుంటే రైతుల పట్ల రేవంత్‌రెడ్డి ఇంత ద్వేషం తో మాట్లాడడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా 3 రోజులపాటు మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో నిరసన కార్య క్రమాలు చేపట్టడంతోపాటు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిట్ట నారాయణ, నాయకులు చుక్క నిరంజన్‌గౌడ్, రమేష్ నాయక్, తల్లోజు రామకృష్ణ, వంకేశ్వరం భీమయ్య, గండికోట శంకర్, పర మేష్, డేరంగుల వెంకటేష్, జంతు క కిరణ్, కోమ్ము ప్రసాద్, పూసల బాస్కర్, మహేష్, రమేష్, శ్రీనునాయక్, రాము, శ్రవణ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News