Monday, December 23, 2024

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మధ్యాహ్న భోజన కార్మికులు రెండవ మంగళవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరవధిక సమ్మెకు మాజీ శాసనభ్యులు జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తానని రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి, సుమారు 20 సంవత్సరాలుగా కావస్తున్నదని, ఈ 20 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్ధికంగా అవస్థలు పడుతూ, మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు సాగిస్తా ఉన్నారు.

కాని, రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 6 నెలల నుండి పెండింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉంచుతూ,కార్మికులను తీసుకొని పెట్టమంటే పెట్టకుండా, నేడు నిత్యావసర వస్తువుల సరుకులు ధరలు ఆకాశాన్నంటాయని, కోడిగుడ్ల ధరలు ఇవాళ ఆరు రూపాయలు ఉంటే ప్రభుత్వం 4 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారన్నారు. కేరళ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు 600 రూపాయలు ఇస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు 33 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు స మంజసమని వారన్నారు.

ఫిభ్రవరీ నెలలో మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలు ఇస్తానని కాగితాలకే పరిమితమై, ఈనాటి వరకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇట్టి సమస్యలపై తాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖవ్రాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఎంసిపిఐయు రాష్ట్ర నాయకులు వి. మట్టయ్య, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్, మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి వి. సైదమ్మ, పోతుగంటి కాశీరాం, సరళ, విజయలక్ష్మి, వెంకాయమ్మ, మట్టమ్మ, అంజమ్మ, నిర్మల, పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News