Monday, December 23, 2024

సిబ్బందికి రూ.12 కోట్ల విలువైన ఇంటి స్థలాలు అందించిన నల్ల మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: శ్రీమంతుడు సినిమాలో తను సంపాదించిన దాంట్లో నుండి కొంత ఊరికి తిరిగి ఇవ్వాలని హిరో చెపుతాడు, ఇక్కడ అచ్చం అలాగే ఎలాంటి స్వార్థానికి పోకుండా తను సంపాదించిన దానిలో నుండి తన వద్ద ఏళ్ళ తరబడి వివిధ రంగాలలో పనులు చేస్తున్న వారి సొంతింటి కళ నెరవేర్చడానికి నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి దాదాపు 80 మందికి ఇంటి స్థలాలు అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామ పరిధి దివ్యానగర్‌లోని ఎన్‌ఎంఆర్ విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన వద్ద 30 ఏళ్ళకు పైగా సెక్యూరిటీ గార్డు, కూలీల నుండి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత హోదాలో పనులు చేసిన వారి వరకు దాదాపు 80 మందికి, 120 చదరపు గజాల నుండి 250 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 12 కోట్ల విలువ చేసే ఎకరన్నర భూమిలో చేసిన ప్లాట్లను సతీమణి సంధ్యవళితో కలసి మంగళవారం లబ్ద్ధిదారులకు అందించి మరో శ్రీమంతుడు అనిపించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఒక లక్షం, విధానం ఉందని, అందులో భాగంగా నాణ్యమైన విద్య అందించడానికి, విద్యలో లోపాలు గుర్తించి పిల్లలో బాల్యం నుండే గట్టి పునాది వేయడానికి అక్షరాభ్యాస్ తీసు క రావడం జరిగిందని తెలిపారు. నేడు నాణ్యమైన విద్య అందడం లేదని, డిగ్రీలు చదివిన వారిలో విషయ పరిజ్ఞానం కొరవడుతుందని అన్నారు.

ఇక్కడ వివిధ రంగాలలో అంకిత భావంతో నిబద్దతో పని చేసే వారికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దివ్యానగర్ ఏర్పడిన నాటి నుండి ఇప్పటికి వరకు దాదాపు 30 ఏళ్ళకు పైగా పను లు చేస్తున్నారని, వారి శ్రమతో అభివృద్ధి చెందుతున్న నేను వారి సొంతింటి కళ నెరవేర్చడానికి వారి అభివృద్ధిని కాంక్షించి ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల కళ్ళలోని ఆనందం తనకు ఎంతో తృప్తినిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల నర్సిం హారెడ్డి విద్యా సంస్థల అధినేత నల్ల నర్సింహా రెడ్డి, నల్ల మల్లారెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్లు దివ్యా, స్నేహ, వైఎస్ ఎంపిపి కర్రె జంగమ్మ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్, సర్పంచ్ కొంతం వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీతముత్యం, వార్డు సభ్యులు రాయబండి నవీన్, బండిరాల శ్యామ్, నల్ల రజిత, నల్ల అరుణ, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, దివ్యానగర్ అసోసియేషన్ సభ్యు లు, వివిధ రంగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News