సిటీ బ్యూరో: ప్రజల అవసరాలకు అ నుగుణంగా వారికి క్షేత్రస్థాయిలోనే పూర్తి పా రద ర్శకతతో కూడిన వేగవంతమైన సేవలను అం దించడమే లక్షంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను పనితీరుపై జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విధానం దేశంలోనే ప్రప్రధమంగా అమలు చేస్తుండడం వార్డు కార్యాలయం వ్యవస్థ అనేది సరికొత్తది కావడంతో అమల్లోలో భా గంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఇటీవలే జి హెచ్‌ఎంసి నూతన కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించిన రోనాల్డ్‌రోస్ చర్యలకు ఉపక్రమించారు. వార్డు కార్యాలయాలను పూర్తిగా గాడిలో పెట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించి ప్రభుత్వ లక్షం నేరవేరేలా కార్యచరణను సిద్దం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముందుగా వార్డు కార్యాలయాల్లో ప్రజలకు అందనున్న సేవలపై విసృత్త ప్రచారం కల్పించడంతోపాటు వార్డు కార్యాలయం సిబ్బంది ప్రజలతో మమేకం కా వడం ద్వారా తమ సమస్యలు పరిష్కరం అవుతాయని భరోసా కల్పిచాల్సిందిగా దిశ నిర్ధేశనం చేస్తున్నారు. ఇందుకు వార్డు కార్యాలయం సిబ్బంది కొంత కష్టపడాల్సిందేనని ఆదేశాలను జారీ చేయడమే కాకుండా రోజువారిగా అందుతున్న పిర్యాదులను పరశీలించడం ద్వా రా వార్డు కార్యాలయాలను పనితీరును మెరుగు పర్చేందుకు కావాల్సిన ప్రణాళికలపై కసరత్తును ప్రారంభించారు.
వార్డు కార్యాలయం మొత్తం వార్డు పరిపాలన అధికారి పర్యవేక్షణలో పని చేస్తుంది. ప్రధానంగా వార్డు స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సబంధింత శాఖ అధికారులతో సమన్వయం చేయడం ద్వారా అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తారు. వార్డు ఇంజనీరు వార్డులోని రోడ్లు, కాల్వలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర మౌలిక సదుపాయాల సంబంధించిన విధులను నిర్వహించడంతో పాటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వార్డు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న వార్డు ఇంజనీర్ మై జిహెచ్‌ఎంసి యాప్, ప్రజావాఇణి, డయల్ 100 జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్‌తో పాటు ఇతర మద్యామాల ద్వారా అందిన పిర్యాదులను సకాలంలో పరిష్కరించనున్నారు.
పట్టణ ప్రణాళికకు సంబంధించి వార్డు టౌన్ ప్లానర్‌ను నియమించారు. ఆయన డివిజన్‌లో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించడం, అనధికార నిర్మాణాలపై పిర్యాదులు అందిన వెంటనే చర్యలు నిజా నిజాలు పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు.
ఎంటామాలజీకి సంబంధించి వార్డు ఎంటమాలజిస్ట్‌ను నియమించారు. వరద నీరు నిలిచే ప్రాంతాలతో పాటు క్యాచ్‌పిట్స్, ఇతర లోతట్టు ప్రాం తాలను గుర్తించి దోమల నింత్రయణ చర్యలను చే పట్టనున్నారు. అదే విధంగా అంటు వ్యాధులు ప్రబలకుండ చర్యలు తీసు కోవడంతో పాటు జంతు జనన ని యంత్రణ, చని పోయిన జంతువుల కళేబరాల తొలగింపుతో పాటు వీటికి సంబంధించి ఫిర్యాదును నిర్దేశించ సమయంలో పరి ష్కరించనున్నారు.
పారిశుధ్యం విభాగానికి సంబంధించి వార్డ్ శానిటరీ జవాన్‌ను అందుబాటులో ఉంటారు. డి విజన్‌లో పూర్తిస్థాయి పారిశుద్యం నిర్వహణ, పరి సరాల పరిశుభ్రతపై కాలనీ సంక్షేమ సంఘాల సమన్వయంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జనన, మరణ దృవీకరణ పత్రాలను సకాలంలో జారీ చేయడం, పారిశుధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించనున్నారు.
పట్టణ సామాజిక అభివృద్ది విభాగానికి సంబంధించి వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్‌ను నియమించారు. బస్తీల్లో పేద కుటుంబాలకు చెందిన మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం, వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను అందించడంతో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందించడం ద్వారా వారిని ఆర్ధికాభివృద్దికి కృషి చేయనున్నారు.
పట్టణ జీవవైవిధ్యం విభాగం నుంచి వార్డు యుబిడి సూపర్ వైజర్‌ను నియమించారు. ఆయన ప్రధాన విధులు వార్డులో నూరు శాతం మొక్కలు నాటడం, కాలనీ సంక్షేమ సంఘాల సహకారం, భాగస్వామ్యంతో ఎండిన మొక్కలను తొలగించి మళ్లీ మొ క్కలు నాడడం ద్వారా డివజన్ పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆ దీశగా ప్రజలను చైతన్యపర్చనున్నారు.
మంచినీరుతో పాటు మురుగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు గాను జలమండలి నుంచి ప్రత్యేకంగా వార్టు అసిస్టెంట్‌ను వార్డు కార్యాలయంలో నియమించారు. డివిజన్‌లో మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు లోప్రెషన్ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు డ్రైనేజికి సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకోనున్నారు.
డివిజన్‌లో విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు వార్డు కార్యాలయంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నుంచి లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్‌లో ఒక్కరిని నియమించారు. విద్యుత్‌కు సంబంధించిన అని రకాల సమస్యలను క్షేత్రస్థాయిలో ఆయన పరిష్కరించనున్నారు.
అదేవిధంగా ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు వార్డు కార్యాలయంలో అన్ని పని వేళల్లో ఆపరేటర్ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఫిర్యాదులకు సంబంధించి సమాచారం అందించడం రశీదులను ఇచ్చేందుకు రిసెప్షన్సింట్‌ను నియమించారు.