Saturday, December 21, 2024

90మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఓక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ఎల్బీనగర్ ఏమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో సరూర్‌నగర్ ,ఉప్పల్ మండలాల 90 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మీ ,షాదీముబారక్ చెక్కులను ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదింటి ఆడపడచులకు కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబాకర్ పథకాలు ఓ వరం లాంటిదని ,ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు ఆర్దిక కష్టాలను తీర్చడానికి ముఖ్య మంత్రి కేసిఆర్ కళ్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా , ఉప్పల్ తహీశీల్దార్ గౌతంకుమార్, సరూర్‌నగర్ డిప్యూటీ తహసీల్దార్ అవినిష్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News