Friday, December 20, 2024

బొట్టు బిళ్ల పెట్టుకుందని కొట్టిన ఉపాధ్యాయుడు… టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాంఛీ: పదో తరగతి విద్యార్థిని బొట్టు బిళ్ల పెట్టుకుందని ఉపాధ్యాయుడు కొట్టినందుకు బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ ప్రాంతంలో జరిగింది. దీంతో పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెతూల్మారీలోని సెయింట్ జెవియర్ స్కూల్‌లో ఉషా కుమారీ(16) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఉషా నుదటి బొట్టు బిళ్ల కనిపించడంతో ఉపాధ్యాయుడు ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తన ఇంటికి వెళ్లిన తరువాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ లెటర్ రాయడంతో స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థులు, బాలిక బంధువులు సెయింట్ జెవియర్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి అశిష్ కుమార్ యాదవ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News