Friday, December 20, 2024

ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ల హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడితోసహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఇంటర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ ఏరోనిక్స్ మీడియా ప్రవైట్ లిమిటెడ్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఓ) విను కుమార్(40), మేనేజింగ్ డైరెక్టర్(ఎండి) ఫనీంద్ర సుబ్రమణ్య(36) మంగళవారం తమ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. వారిని దుండగులు గొడ్డళ్లతో నరికి చంపివేశారు. ఈ జంట హత్యలకు సంబంధించి ప్రధాన నిందితుడు శబరీష్ అలియాస్ ఫెలిక్స్(27)తోపాటు వినయ్ రెడ్డి(23), సంతోష్ అలియాస్ సంతోష్(29)లను అమృతహల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

అమృతహల్లి సమీపంలోని పంపా ఎక్స్‌టెన్షన్ వద్ద ఉన్న ఏరోనిక్స్ మీడియా కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం చొరబడిన నిందితులు ఇతర ఉద్యోగుల సమక్షంలోనే సుబ్రమణ్యపై కత్తులతో దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన కుమార్‌ను కూడా కత్తులతో నరికివేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి ఉద్యోగులు తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్యకుగల కారణాలు ఇంకా బయటకు రానప్పటికీ వ్యాపార శత్రుత్వమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News