అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తారని ఎపి ఎఫ్‌డిసి ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. బుధవారం పోసాని మీడియాతో మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలోని ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్ ఎందుకు స్పందించడంలేదని అడిగారు. భీమవరంలో టిడిపి వల్లే పవన్ ఓడిపోయారని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు సిఎంగా జగనే ఉంటారన్నారు.
Also Read: వరుడు అక్కడ..వధువు మరెక్కడో..పెళ్లి జరిగిపోయింది !
గతంలో డేటా చౌర్యం చేసింది చంద్రబాబు, నారా లోకేష్ కాదా? అని ప్రశ్నించారు. సిఎం జగన్‌ను విమర్శించడమే పవన్ పనిగా పెట్టుకున్నారని పోసాని మండిపడ్డారు. వాలంటీర్లపై పవన్ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని, పవన్‌కు ఎథిక్స్ ఉంటే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు పవన్‌కు ఎందుకు చెబుతాయని పోసాని అడిగారు. చంద్రబాబు గుప్పిట్లో పవన్ ఉన్నారని, ఇప్పటికైనా చంద్రబాబును నమ్మడం పవన్ ఆపాలన్నారు.