Monday, January 20, 2025

నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: కుఖాయ్ నదిలో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయిన సంఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలింటా బ్లాక్‌లోని ధబలాహర్ గ్రామంలోని కుఖాయ్ నదిలో ఎనిమిది మంది విద్యార్థులు స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా నలుగురు విద్యార్థులు వరదలో కొట్టుకొనిపోయారు. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో రెండు మృతదేహాలను బయటకు తీయగా గల్లంతైన మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు జమ్‌షెడ్ పూర్‌కు చెందిన అర్యాన్ మిశ్రా, కటక్‌కు చెందిన కుమార్ అవినాష్, బాలాసోర్‌కు చెందిన రోహిత్ పరిడా, బాలికుడాకు చెందిన ధలసమంతాగా గుర్తించారు. ఓ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వాళ్లు స్నానం చేస్తుండగా జారిలోపలికి పడిపోయారని మిగిలిన విద్యార్థులు తెలిపారు.

Also Read: 10 గంటల కరెంట్ ఇస్తే అక్కడ రాజీనామా చేస్తా… సవాల్‌కు సిద్ధమా కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News