Thursday, November 14, 2024

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బుధవారం బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తుంటే అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ మీట్ అండ్ గ్రీట్ సభలో రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్తు ఇస్తే చాలు అన్న వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కడారి శంకర్ ఆధ్వర్యంలో ధర్నా అనంతరం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై మాట్లాడారు. రేవంత్ వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసిందన్నారు. దీంతో రైతుల తీవ్ర వ్యతిరేకత కారణంగా తిరిగి వెనకకు తీసుకున్నట్లు గుర్తు చేశారు.

మోటర్లకు మీటర్లు అమర్చాలని చూస్తే సిఎం కెసిఆర్ వ్యతిరేకించారన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతున ప్రభుత్వాన్ని చూసి ప్రతి పక్షాలకు ఓర్వ లేక పోతున్నాయన్నారు. రైతు పక్షపాతి కెసిఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జైపాల్ రెడ్డి, ఎంపిపి రడపాక సుదర్శన్, జడ్పిటిసి సభ్యురాలు ఇల్లందుల బేబి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, స్థానిక సర్పంచ్ బివి నర్సింగరావు, ఎంపిటిసి సభ్యులు జ్యోతి రజిత యాకయ్య, ఇల్లందల స్రవంతి మొగిళి, మార్కెట్ డైరెక్టర్ తాటికాయల వరుణ్, గ్రామశాఖ అధ్యక్షుడు సింగారపు శ్రీధర్, తిమ్మాపూర్ సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు, నాయకులు పెండ్లి స్వామి, ధనుంజయ, నరేశ్, మేర్గు రమేశ్, కొత్వాల కుమార్, గుడ్డేటి స్వామి. ఆకారపు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News