దమ్మపేట : గ్రామ పంచాయతీ కార్మికులు ఏడో రోజు సమ్మెలో భాగంగా బుధవారం అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, స్థానిక ఎంపీపీ ప్రసాద్ ఇళ్ళను ముట్టడి చేసి, సమస్యలతో కూడుకున్న వినతి పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలను పంచాయతీరాజ్ మంత్రి దృష్టికి, రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్‌కి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినారు. దమ్మపేట ఎంపీపీ ప్రసాద్ మాట్లాడుతూ మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నా వంతు కృషి చేస్తానని తెలిపినారు.
అనంతరం కార్మికులు ప్రదర్శన ర్యాలీగా మొద్దులగూడెం, నాయుడుపేట, తాటి సుబ్బన్న గూడెం, తొట్టి పంపు, సీతారాంపురం, నాచారం, నాగుపల్లి, మొండివర్రె, శ్రీరాంపురం. గండుగులపల్లి, బంజర, కొమ్ముగూడెం గ్రామపంచాయతీల లో ప్రదర్శన అనంతరం దమ్మపేట సమ్మెలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, వెంకీ ప్రభాకర్, గొర్రెపాటి బసవయ్య,పెరుమళ్ళ రాంబాబు, తిమ్మరాజు అన్నవరం, సింగు జ్యోతి, నరసమ్మ, రాములు, ధర్మారావు, నాగార్జున, రామకృష్ణ, బాబు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.