Sunday, December 22, 2024

విద్యాసంస్థల బంద్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

గుండాల : మండల కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన బందులో భాగంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల కళాశాలలు బంద్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి షాహిద్, పిడిఎస్‌యు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్, పిడిఎస్‌యు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ…వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి బందును విద్యార్థులు అందరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.

రాష్ట్రంలో నేడు విద్యారంగ సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేదని ఇంటర్మీడియట్ కాలేజీల్లో కనీస వస్తువులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి నాయకులు రవివర్మ, పవన్ కళ్యాణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News