Saturday, December 21, 2024

మార్కెట్ కమిటీలు రైతుల సంక్షేమానికి కృషి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట: రైతుల సంక్షేమానికి అండగా నిలుస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని, మార్కెట్ కమిటీలు రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్ కమిటీలు పనిచేస్తాయని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేటలోని దుర్గ ఫంక్షన్‌హాలులో సదాశివపేట మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైనఆయన డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యంతో కలిసి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. జిల్లాలోనే సదాశివపేట మార్కెట్‌ను ఒక మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

స్వరాష్ట్రంలో రైతుల ముఖ చిత్రం మారిందన్నారు. సిఎం పాలనలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ తీసుకు వచ్చారని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. మార్కెట్‌లలో రైతులు పంటలు విక్రయించి అధిక ధరలు పొందాలన్నారు. మార్కెట్ యార్డులను ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిందన్నారు. సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కృప, వైస్ చైర్మెన్‌గా శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్‌లుగా కుమార్‌గౌడ్, కరుణాకర్,విద్యాసాగర్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింత గోపాల్, ఎంపిపిలు యాదమ్మ, మనోజ్‌రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మల్లేశం, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, విఠల్ కౌన్సిలర్‌లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, నాయకులు సుధీర్‌రెడ్డి, ఎర్రోళ్ల చిన్న, వీరేశం, పాండురంగం, గోవర్దన్‌రెడ్డి,మల్లాగౌడ్, సంతోష్‌రెడ్డి, రామాగౌడ్, రుక్మోద్దీన్ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News