- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం : వివిప్యాట్ గోదాం వద్ద పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలోని వివిపాట్, ఈవియం, గోదాంను తనిఖీ చేశారు.అనంతరం గోదాం సీలు, సిసి కెమెరాలు, వివిప్యాట్‌లు, ఈవిఎంలు పరిశీలించి తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవియం గోదాం వద్ద చేపట్టిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసిన నివేదిక పంపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బిఆర్‌ఎస్ నాయకులు సాంబ శివనాయక్, సిపిఐ నుంచి సత్యనారాయణ, బిజెపి లక్ష్మణ్ అగర్వాల్, బిఎస్పీ నుంచి కళ్యాణ్, రాహుల్, సిపిఎం నుంచి సలీం, కాంగ్రెస్ నుంచి సంతోష్‌కుమార్, ఎన్నికల సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -