Monday, December 23, 2024

ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలంటే సెల్ టవర్లు అవసరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటినరీ బాలికల హాస్టల్ విద్యార్థుల కోసం కొత్తగా నిర్మించిన సెల్యులార్ మొబైల్ టవర్‌ను ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ ప్రారంభించారు. ఓయూ పాలకమండలితో ఒప్పందంలో భాగంగా ఇండస్ టవర్ ఈ సెల్యులార్ టవర్‌ను నిర్మించింది. దశాబ్దాలుగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఇతర ఉద్యోగులు మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలంటే మొబైల్ సెల్యులార్ సిగ్నల్ తప్పనిసరి కావటంతో సెల్యులార్ టవర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బాలికల హాస్టల్ తో పాటు పక్కనే ఉన్న ఐసీఎస్‌ఎస్‌ఆర్, అంతర్జాతీయ అధ్యయన కేంద్రం సహా పక్కనే ఉన్న మిగతా హాస్టల్స్ సైతం మొబైల్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు వచ్చినట్లు వివరించారు. ఓయూలోని మిగతా ప్రాంతాల్లోనూ విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ సేవలను విస్తృత పర్చాలని ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో మౌళికవసతుల విభాగం సంచాలకులు ప్రొఫెసర్ పి నవీన్ కుమార్ ఇండస్ టవర్ తో సమన్వయం చేసి పనులు పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైశాల్యం విస్తృతంగా ఉండటంతో మరిన్ని టవర్ల అవసరం ఉందని ఇందుకోసం పనిచేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, క్యాంపస్‌లోని డీన్‌లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ఆయా కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు. ఎయిర్‌టెల్ జోనల్ బిజినెస్ మేనేజర్ ఇంద్రనీల్ చౌదరి, ఎయిర్‌టెల్ టెరిటరీ సేల్స్ మేనేజర్ రవికిరణ్, ఇండస్ టవర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జి. అరుణ్ కుమార్ మరియు ఇండస్ టవర్స్ న్యూ బిల్ లీడ్ మల్లికార్జున్ రావు ఎయిర్‌టెల్ టీమ్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News