Friday, September 20, 2024

అన్ని వర్గాల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: అన్ని వర్గాల సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం రామన్నపేట ఎంపిడివో కార్యాలయంలో మండలంలోని వివిద గ్రామాలకు చెందిన 15మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణి చేశారు. అదేవిధంగా 24మందికి రూ.14లక్షల రూపాయల సిఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గా ల సంక్షేమమే సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి,షాదిముబారక్ పథకం నిలిచిందని, అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్షం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకం వెనుక ఓ మానవీయ కోణం దాగిఉందని అన్నారు. అనంతరం మండలంలోని దుబ్బాక గ్రామంలో రూ. 40లక్షలు,ముని పంపుల గ్రామంలో రూ.30లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృధ్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అంతకు ముందు రామన్నపేట మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో రూ .15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్పీ, ప్రహరీ గోడను ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో ఆవరణలో హరితాహారం మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కన్నెబోయిన జ్యోతి ,సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మ ందడి ఉదయ్‌రెడ్డి, వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్ , మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మామిళ్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News