Friday, November 15, 2024

రైతన్న సంతోషాన్ని కాంగ్రెస్ ఓర్వడం లేదు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కేసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రేస్ పార్టీ నాయకులకు ఓర్వడం లేదని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మండిపడ్డారు. బుదవారం నగరంలో ఏర్పాటు చేపిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం కోసం ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంట్ పై వ్యతిరేకంగా చేసిన వాఖ్యలు దేనికి సంకేతమని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పెట్టుకొని… కక్ష సాదించే దిశగా వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడటం చాలా ధారుణమన్నారు. ఇలా వాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి మరియు కాంగ్రేస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పాలనలో రైతులు భార్య బిడ్డలతో సంతోషంగా ఉండటం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చిన కట్టం నష్టం ఏంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో 7 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు అంటూ… రైతులను అష్టకష్టాలు పెట్టిన పరిస్థితిని ఎవ్వరు మరిచిపోలేదన్నారు.

కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియకుండ రాత్రిళ్లు వ్యవసాయ బావుల వద్ద పడుకొని పాము కాటుకు గురై వందలాది మంది రైతులు చనిపోయారని… ఆ సంఘటనలను రైతులు ప్రజలు మరిచిపోలేదన్నారు. మల్లీ రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తున్నారో…! గతంలో లాగే రైతులు కరెంట్ కట కట తో బషీర్ బాగ్ లాంటి కాల్పుల ఘటనలు జరగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నారా…? బషీర్ బాగ్ కాల్పుల సంఘటనను ఇప్పటికీ ఎవ్వరు మరిచిపోలేదని అన్నారు.

ఆ నాడు బషీర్ బాగ్ ఆంధోళనలో స్వయంగా నేను పాల్గొన్న వ్యక్తిగా చెబుతున్నా…పోలీసులు రైతుల పైకి ఆధోళన కారుల మీదికీ తుపాకులు ఎక్కు పెట్టి కాల్పులు జరపితే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అవేదన వ్యక్తం చేసారు. మల్లీ బషీర్ బాగ్ లాంటి ఘటనలు పునరావృతమై రైతులు పోలీసుల తూటాలకు బలికావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా…? అని ప్రశ్నించారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు తలా ఓ వైపు నేను సీఎం అభ్యర్థి అం నేను సీఎం అభ్యర్థి అని నాలుగు స్థంభాలాట ఆడుతున్నారు. రానీ అధికారం కోసం ఒక వైపు రేవంత్ రెడ్డి, ఓ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చిన్న పిల్లల్లా నాలుగు స్థంబాలాట ఆడుతున్నారని ఎద్దేవ చేశారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఖండించకపోవడం అం ఆయన వ్యాఖ్యలను సమర్థించినట్లు కాదా.. అన్నారు.

ఎక్కడ కూడ ఓల్టేజి తగ్గకుండా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలకు మీ పాలనలో 200 పెన్షన్ ఉం మా పాలనలో 2 వేలు….వికలాంగుల 3 వేలకు చేరిందని స్పష్టం చేశారు. రైతు బందు, రైతు బీమా, ఇంటి వద్దే ధ్యానం కొనుగోలు, సరైన మద్దతు ధర, కళ్యాణ లక్ష్మీ షాధీముభారాక్, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం, ఆరోగ్య లక్ష్మీ ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్న దమ్మన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని… ప్రజలు సరైన బుద్ది చెప్పడం ఖాయం అని జోష్యం చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు గంట కళ్యాణీ, గుగ్గిల్ల జయశ్రీ, తోట రాములు, నేతి కుంట యాదయ్య, దిండిగాల మహేష్, భూమాగౌడ్, ఐలేంధర్ యాదవ్, బుచ్చిరెడ్డి, వాల రమణ రావు, నాంపల్లి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు మేచినేని అశోక్ రావు, పిట్టల శ్రీనివాస్, కాబట్టి శ్రీనివాస్, నక్క కృష్ణ, గంట శ్రీనివాస్, గుగ్గిల్ల శ్రీనివాస్, కోల సంపత్ రెడ్డి, ఖరీం, శంకర్ గౌడ్, హమీద్, బాలరాజు, కుంభం అనీల్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News