Monday, December 23, 2024

అర్థాంతరంగా ముగిసిన రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తానా సభలకు హాజరయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి అర్థాంతరంగా తన పర్యటన ముగించిన స్వరాష్ట్రానికి బయలు దేరారు. నిజానికి ఈనెల 15 వరకు అమెరికా పర్యటలోనే ఉంటారని మొదట ఆయన అనుచరులు తెలిపారు.

కానీ అనుహ్యంగా షెడ్యూల్ కంటే ఆయన తిరిగి తెలంగాణకు రావడం ఆసక్తిగా మారింది. తానాల సభల కోసం వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు దూమారంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ది సీతక్క అని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో హుటాహుటిన ఆయన తిరిగి రాష్ట్రానికి రావడం ఆసక్తిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News