- Advertisement -
కోయిలకొండ : మండల కేంద్రంలోని శ్రీరామకొం డపై బుధవారం దేవాలయ దర్శనానికి వెళ్లిన భక్తులకు చిరుత పులి కనపడటంతో భయాందోళన చెందారు. కొండపైకి వెళ్లే మార్గంలో గుండ్ల మధ్యన కొండపై దర్శనానికి వెళ్లిన మల్కాపూర్ రాజుకు కనపడటంతో కొండ కిందికి వచ్చేశాడు.
చిరుత పులి పిల్లను తాను చూడటం జరిగిందని, మరో పెద్ద చిరుత సైతం అదే ప్రాంతంలో ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో శ్రీరామకొండ పరిసర ప్రాంతాల్లోని పొలాల రైతులు, కొండపైకి వెళ్లే భక్తులు ఒక్కసారి భయపడుతున్నారు.
- Advertisement -