Wednesday, December 25, 2024

సిఎం కెసిఆర్‌కు ధూప దీప నైవేద్య సంఘం కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిహెచ్‌ఎంసి పరిధిలో మొట్టమొదటిసారిగా ధూ ప దీప నైవేద్య పథకం అమలుపర్చడంతో పాటు కొత్తగా మ రో 3500 దేవాలయాలను చేర్చడం పట్ల ధూప దీప నైవేద్యం సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ప్రతి నెల ఇచ్చే మొత్తాన్నిరూ. 6 వేల నుంచి రూ. 10 వేల కుపెంచినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ధూప దీప నైవేద్య సంఘం ప్రతినిధుల బృందం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి వేద ఆశీర్వచనం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనెల 13 తేదీ నుంచి 26వ తే దీ వరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలలో ధూ ప దీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ధూప దీప నైవేద్య సంఘం రాష్ట్ర కన్వీనర్ జిహెచ్‌ఎంసి అధ్యక్షులు శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు ఎమ్మెల్సీ కవితకు వివరించారు.

ఈ సందర్భంగా దూప దీప నైవేద్య అర్చకుల ఉద్యోగ భద్రత అంశాన్ని కవితతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నందనం హరికిషన్, జిహెచ్‌ఎంసి ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాష్ స్వామి, జిహెచ్‌ఎంసి కార్య నిర్వాహక కార్యదర్శి శివకుమార్ స్వామి , మేడ్చల్ జిల్లా కార్యదర్శి కుమార స్వామి, ఎగ్జిక్యూటివ్ స భ్యు లు పాలప్రోలు శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News