- Advertisement -
ఢిల్లీ: ఉత్తరాదిలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ నగరం అతలాకుతలమవుతోంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో యమునా నదిలో ప్రవాహం ఆందోళకు గురచేస్తోంది.
యమునా నది నీటిమట్టం 208.46 మీటర్ల ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. ప్రమాదకర స్థాయికి మూడు మీటర్లపైన యమునా నది ప్రవహిస్తుండడంతో కేంద్ర జల సంఘం అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర పరిస్థితి అని ప్రకటించిన కేంద్ర జల సంఘం..
- Advertisement -