- Advertisement -
హైదరాబాద్: నగరంలో కిడ్నాప్ కలకలం రేపింది. బండ్లగూడలో సాయిచరణ్ అనే 12 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటికి వెళ్లిన సాయిచరణ్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుప్రక్కల వెతికారు.
ఎంతకూ కనిపించకపోవడంతో వారు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: నగ్నంగా వీడియో కాల్ చేసింది…. వ్యాపారవేత్త ఆత్మహత్యాయత్నం
- Advertisement -