- Advertisement -
ముంబయి: ఇంజక్షన్ వేసుకొని వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డా ఉమేష్ అగర్వాల్ అనే కంటి వైద్యుడు జయంతి టాకీస్ చౌక్‌లో సాయి ఐ క్లీనిక్‌ను నడుపుతున్నాడు. తన క్లీనిక్‌లో ఇంజక్షన్లు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యలా? లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని వెల్లడించారు. క్లీనిక్‌లో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
Also Read: శౌర్య పతకానికి ఎంపికైన ములుగు జిల్లా ఎస్సై
- Advertisement -