Saturday, December 21, 2024

వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా?

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్ల విధివిధానాలు ఏంటో జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇటీవల ఏలూరులో వారాహి విజయయాత్ర సందర్భంగా..ఎపి వాలంటీర్లను మహిళల కిడ్నాప్ లకు వైసిపి నేతలు వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఎపిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పవన్ పై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ వ్యాఖ్యలను ఖండించారు. పవన్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా? అని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అద్భుతమైన వ్యవస్థగా గుర్తింపు పొందిందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితో పవన్ ఆరోపణలు చేస్తున్నారని బొత్స నిప్పులు చెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News