Saturday, December 21, 2024

పెళ్లి మాట విని రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే…

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు పెళ్లంటే భయమా? ఆడవారి శరీరాలే తప్ప వారి మనసుతో ఆయనకు పనిలేదా? స్త్రీలను కేవలం సెక్స్ కోసమే ఆర్‌జివి వాడుకుంటారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నారు ప్రముక బాలీవుడ్ నటి సుచిత్రా కృష్ణమూర్తి. మాసూమ్, మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్ చిత్రాల దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య ఈ సుచిత్రా కృష్ణమూర్తి. ఆమె ఆర్‌జివి నిర్మించిన మై వైఫ్స్ మర్డర్, రన్ చిత్రాలలో నటించారు. ఇటీవల ఆమె తన ఆత్మకథను డ్రామా క్వీన్ పేరిట విడుదలచేశారు . అందులో ఆమె ఆర్‌జివి గురించి చాలా ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు.

ఒకరోజు తాను ఆర్‌జివికి నన్ను పెళ్లి చేసుకుంటారా అని సెల్‌ఫోన్‌లో టెక్ట్ మెసేజ్ పంపానని సుచిత్ర తన ఆత్మకథలో తెలిపారు. తాను జోక్‌గా ఈ మెసేజ్ పంపినప్పటికీ రాము మాత్రం చాతా సీరియస్‌గా తీసుకున్నారని ఆమె తెలిపారు. వెంటనే తన ఆఫీసుకు రావాలని ఫోన్ చేసిచెబితే తాను వెళ్లానని ఆమె చెప్పారు. తన పెళ్లి ప్రతిపాదనను రాము తోసిపుచ్చడమేగాక తాను మహిళలను కేవలం సెక్స్ కోసం మాత్రమే వాడుకుంటానని చెప్పాడని ఆమె తెలిపారు. మహిళల దేహాలు మాత్రమే తనకు నచ్చుతాయి తప్ప వారికి మెదళ్లు కావని కూడా ఆర్‌జివి అన్నారని ఆమె చెప్పారు. మహిళలను చూడాలే తప్ప వినకూడదన్నది తన అభిప్రాయమని కూడా చెప్పారని సుచిత్ర వివరించారు.
అయితే..బాలీవుడ్ ఠికానాకు ఇచ్చిన ఇంటర్వూలో మాత్రం సుచిత్ర ఇదంతా ఒక జోక్ మాత్రమేనని తేల్చేశారు. రాంగోపాల్ వర్మతో పెళ్లి ప్రస్తావన తాను చేసిన మాట నిజమేనని, అయితే అది కేవలం జోక్ మాత్రమేనని ఆమె చెప్పారు. రాంగోపాల్ వర్మతో పెళ్లి గురించి ఎవరైనా సీరియస్‌గా ఆలోచిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. రాము చాలా మంచోడు, అయితే నా మెసేజ్ చూసి భయపడిపోయాడు. అదే పెద్ద కామెడీ..అంటూ ఆమె అన్నారు.

తన మెసేజ్ చాసిన రాము ఇదంతా నిజమేనని నమ్మి తనను ఆఫీసుకు పిలిపించాడని ఆమె ఆ ఇంటర్వూలో చెప్పారు. నువ్వు చాలా మంచి అమ్మాయివని చెబుతూ తాను చాలా దుర్మార్గుడినని కూడా ఆర్‌జివి చెప్పారని ఆమె అన్నారు. ఇతనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాకూడదని రాము క్లాసు తీసుకున్నారని ఆమె చెప్పారు. రాము..ఇదంతా జోకు అని తాను చెబుతున్నప్పటికీ ఆయన మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారని సుచిత్ర చెప్పారు.

నటిగా, గాయనిగా బాలీవుడ్‌లో పనిచేసిన సుచిత్ర 1999లో శేఖర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2007లో ఈ జంట విడిపోయింది. సుచిత్ర తన ఆత్మకథలో ప్రముఖ నటి ప్రీతి జింటాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కపూర్, ప్రీతి జింటా దగ్గరయ్యారంటూ వదంతులు వస్తున్న కాలంలో ఆమె తనపై చేసిన వ్యాఖ్యల పట్ల సుచిత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News