Saturday, December 21, 2024

బొత్సకు తెలంగాణ మంత్రుల కౌంటర్..

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిఎస్‌పిఎస్సిపై ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిని వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లు కౌంటర్ ఇచ్చారు. సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందని.. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని, ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణలో దాపురించిందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

బొత్స వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. “ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా?., రాజధాని కూడా లేని రాష్ట్రం అది. బొత్స అలా మాట్లాడటం సరికాదు. గతంలో ఎపిపిఎస్సిలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలి. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు” అని పేర్కొన్నారు.

“ఏపీలో 308 గురుకులాలే ఉన్నాయి. తెలంగాణ, ఏపీలో ఎన్ని గురుకులాలున్నాయో బొత్స తెలుసుకోవాలి. ఏపీలో విద్యావ్యవస్థ అసలు ఎక్కుడుంది. టిఎస్‌పిఎస్సి స్కాంను బయటపెట్టింది మా ప్రభుత్వమే కదా!. మీ రాష్ట్రంలో బదిలీలను అమ్ముకుంటున్నారు” అని గంగుల విమర్శించారు.

Also Read: త్వరలో కొత్త ఇంట్లోకి రాహుల్ గాంధీ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News